తమిళనాడులో ఘోరం.. గంజాయి మత్తులో యువకుడిని కొట్టి చంపేసిన ఫ్రెండ్స్

గంజాయి మత్తులో ఘర్షణ పడిన యువకులు ఏకంగా స్నేహితుడినే చంపేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని తిరువొత్తియూరు రాజాకడై రామానుజం వీధికి చెందిన రవి(45) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి కొడుకు జయరామన్(18) ఈ నెల 25వ తేదీ రాత్రి బైక్‌పై బయటకు వెళ్లి తిరిగిరాలేదు. చుట్టుపక్కల వెతికినా అతడి ఆచూకీ లభించకపోవడంతో తర్వాతి రోజు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:

వెళ్లివాయల్‌ చావడికి చెందిన జయరాజ్‌ అనే యువకుడికి జయరామన్‌ ఫోన్‌ నుంచి 25వ తేదీ రాత్రి ఫోన్‌ వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఆ సమయంలో వాహనం నడుపుతున్న జయరాజ్‌ ఫోన్‌ మాట్లాడలేదు. చొక్కా జేబులో పెట్టే క్రమంలో ఫోన్‌ లిఫ్ట్‌ అయి 6 నిమిషాల కాల్‌ రికార్డు అయింది. ఇంటికి చేరుకున్న తర్వాత జయరాజ్‌ రికార్డు అయిన మాటలు విని దిగ్భ్రాంతికి గురయ్యాడు. దీంతో అతడు మరుసటి రోజు జయరామన్ కుటుంబసభ్యులు, పోలీసులకు దాన్ని వినిపించాడు. దాన్ని పరిశీలించిన పోలీసులు నాగరాజ్‌(18), అలీబాబా(18), గణేశన్‌(18), జోసఫ్‌(18), సూర్య(18), మహ్మద్‌ ఆసిఫ్‌(19)ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read:

25వ తేదీ రాత్రి జయరామన్‌ని ఆరుగురు ఫ్రెండ్స్ బలవంతంగా ఎన్‌టీవో కుప్పానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అక్కడ గంజాయి తాగడంలో ఎవరు గొప్ప అనే దానిపై జయరామన్‌తో వారంతా గొడవ పడ్డారు. ఘర్షణ పెరగడంతో మత్తులో ఉన్న స్నేహితులు రాయి, పెంకులు, సీసాలతో జయరామన్‌ని కొట్టి చంపేశారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా సముద్ర తీరంలో పూడ్చిపెట్టారు. సోమవారం సాయంత్రం చాకలిపేట డిప్యూటీ కమిషనర్‌ సుబ్బులక్ష్మి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here