ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్తాపం… మెదక్‌లో నవవధువు ఆత్మహత్య

ఇష్టం లేని వివాహం చేశారన్న మనస్తాపంతో ఓ యువతి పెళ్లయిన రెండు నెలలకే ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో గురువారం జరిగింది. టేక్మాల్‌ మండలంలోని ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన మాధవి(19)కి ముప్పారం గ్రామానికి చెందిన నాగభూషణంతో ఈ ఏడాది మార్చి 15న వివాహమైంది. అయితే భార్య తనతో చనువుగా ఉండకపోవడంతో నాగభూషణం అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు కూతురికి నచ్చజెప్పి భర్తతో సఖ్యతో ఉండాలని చెప్పి మెట్టినింటికి పంపించారు.

Also Read:

ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు నాగభూషణానికి ఫోన్ చేసి.. ‘నీ భార్య, నేను ప్రేమించుకున్నాం. ఆమెను నువ్వు వదిలేస్తే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం’ అని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాగభూషణం దీనిపై పెద్దల మధ్య పంచాయతీ పెట్టాడు. దీంతో రెండ్రోజుల క్రితం మాధవి పుట్టింటికి వచ్చింది .గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Also Read:

మాధవి గతంలో ఓ యువకుడిని ప్రేమించిందని, ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించి నాగభూషణానికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసినట్లు తెలుస్తోంది. అటు ప్రియుడితో కలిసి జీవించలేకపోతున్నానన్న ఆవేదన, భర్తతో కాపురం చేయడం ఇష్టంలేక మానసిక క్షోభకు గురయ్యే మాధవి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి, అల్లాదుర్గం సీఐ రవికుమార్‌ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ ఘటనపై ఎస్ఐ మోహన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here