మద్యం హోం డెలీవరి చేయండి: సుప్రీంకోర్టు

మ ద్యం షాపులు తెరవడంతో భౌతిక దూరం ప్రశ్నార్థకమైన కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం హోమ్ డెలివ‌రీ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది. ఇదే సమయంలో మద్యం విక్రయాలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. వైన్ షాపుల ముందు మద్యంప్రియులు బారులుతీరడం, భౌతిక దూరం విషయాన్ని మరచిపోయి గుంపులుగా గుంపులుగా లిక్కర్ కోసం ఎగబడుతున్న అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం (మే 8) విచారణ చేపట్టింది.

జస్టిస్ అశోక్ భూషణ్ సంజ‌య్, జస్టిస్ కృష్ణ కౌల్‌, జస్టిస్ బీఆర్ గ‌వితో కూడిన త్రిస‌భ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై విచారణ చేపట్టింది. వైన్ షాపుల వ‌ద్ద భారీ జ‌న‌స‌మూహాన్ని అరిక‌ట్టేందుకు ‘హోం డెలివ‌రీ’ అవ‌స‌ర‌మ‌ని న్యాయస్థానం అభిప్రాయ‌ప‌డింది. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయ‌లేమని వ్యాఖ్యానించింది.

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో మార్చి 25 నుంచి దేశ‌వ్యాప్తంగా మ‌ద్యంషాపులు మూత‌ప‌డ్డాయి. లాక్‌డౌన్ 3.0లో ఆంక్షలు సడలించి మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నాలుగు రోజులుగా మద్యం షాపులకు జనం పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది సోషల్ డిస్టెన్స్ నిబంధనలను పాటించడంలేదు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభించే ప్రమాదం ఉందని.. లాక్‌డౌన్‌తో ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా వృథా అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం అమ్మకాలను నిలిపివేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here