ఇవాళ రాత్రికి ప్రధాని మోదీ ప్రసంగం.. లాక్‌డౌన్ మళ్లీ పొడిగిస్తారా!

ప్రధాని నరేంద్రమోదీ మరోసారి ప్రసంగించనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు మోదీ జాతిని ఉద్దేశించి కీలక ప్రకటన చేయనున్నారు. మరో ఐదు రోజుల్లో లాక్‌‌డౌన్ ముగియనుండటంతో ప్రధాని ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. పొడిగింపుపై నిర్ణయమా.. సడలింపులకు సంబంధించి ఏదైనా చెప్పబోతున్నారా అన్నది ఆసక్తికరేపుతోంది.

ప్రధాని సోమవారం కూడా అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా పరిణామాలపై చర్చించారు.. లాక్‌డౌన్ అంశంతో పాటూ కరోనా కేసులపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పులువురు సీఎంలు కొన్ని సూచనలు చేశారు. ఆ మరుసటి రోజే ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here