ఇవాంక ట్రంప్ పీఏకు కరోనా పాజిటివ్

అమెరికాలో కలకలం రేపుతున్న కరోనా వైరస్ వైట్ హౌజ్ వరకు చేరింది. డోనాల్డ్ ట్రంప్ కూతురు పర్సనల్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఇవాంక ట్రంప్, ఆమె భర్త జారేద్ కుష్నర్‌ టెస్టులు చేయించుకున్నారు. దీంతో వారిద్దరికి నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చింది. యూఎస్‌లో ఇప్పటికీ 76వేల మంది కరోనా బారిన పడి మృతి చెందినట్లు తెలుస్తోంది.

యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కొవిడ్-19 పాజిటివ్ గా కన్ఫార్మ్ అయిన తర్వాత ఇవాంక ట్రంప్ పర్సనల్ అసిస్టెంట్ కు టెస్టులు నిర్వహించారు. కొద్ది రోజుల ముందు ట్రంప్ కు సన్నిహితంగా పనిచేసే వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌కు కరోనా వైరస్ టెస్టులు చేశామని.. వీరిద్దరూ కూడా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నారని వైట్ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ హోగన్ గిడ్లే తెలిపారు. తాజాగా వైట్ హౌజ్ మెడికల్ యూనిట్ కు సమాచారం అందించి.. వైట్ హౌజ్ క్యాంపస్ లో పనిచేసే యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలినట్లు గిడ్లే తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా ట్రంప్ స్టాఫ్ అందరికీ కరోనా టెస్టుులు నిర్వహిస్తున్నామన్నారు.

మరోవైపు అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో నిన్న మొత్తం 29వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 78వేల మందికిపైగా మృతి చెందారు. కరోనా బారినపడి 2లక్షల 23వేల మంది కోలుకున్నారు. దాదాపు 17 వేల మంది చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. 10లక్షల మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి భవనం వైట్ హౌజ్ వరకు కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here