ఇంట్లోనే పేకాట.. డబ్బులు పోయాయని.. టీఆర్‌ఎస్ కార్పొరేటర్ భర్త అరాచకం

లాక్‌డౌన్ వేళ నగరంలోని ఓ అధికార పార్టీ కార్పొరేటర్ భర్త రెచ్చిపోయాడు. తన ఇంటినే స్థావరంగా మార్చేశాడు. తన స్నేహితుల ద్వారా పలువురిని పిలిపించి పేకాట ఆడించడమే కాకుండా డబ్బులు పోయాయని దబాయించాడు. మళ్లీ ఆడాల్సిందేనంటూ పిలిపించి కారులో కొట్టుకుంటూ రోడ్లపై హల్‌చల్ చేశాడు. బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

టీఆర్ఎస్ కార్పొరేటర్ అలకుంట సరస్వతి భర్త హరి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తన ఇంటినే పేకాట స్థావరంగా మార్చేశాడు. లాక్‌డౌన్ ప్రారంభం నాటి నుంచి పేకాటకు తెరలేపాడు. తన స్నేహితులు, అనుచరుల ద్వారా యువకులను రప్పించి పేకాట ఆడించేవాడు. తాను కూడా పేకాట ఆడేవాడు. రెండు రోజుల కిందట నిఖిల్ అనే వ్యక్తి తన స్నేహితులు ప్రదీప్ కుమార్, గణేష్‌లతో కలిసి తార్నాకలోని హరి ఇంట్లో పేకాట ఆడారు.

Also Read:

ఆ రోజు ఆటలో కార్పొరేటర్ భర్త హరి సుమారు 70 వేల వరకూ పోగొట్టుకున్నాడు. దీంతో నిఖిల్, అతని స్నేహితులు పేకాటలో మోసం చేసి డబ్బులు కాజేశారని దూషిస్తూ మళ్లీ పేకాటకు రావాలని హుకుం జారీ చేశాడు. అధికార పార్టీ కార్పొరేటర్ భర్త కావడంతో అతని బెదిరింపులకు భయపడిపోయిన నిఖిల్ పారిపోయాడు.

నిఖిల్ స్నేహితులు ప్రదీప్ కుమార్, గణేష్‌లను పట్టుకున్న హరి.. వారిద్దరినీ చావబాదాడు. కారులో ఎక్కించుకుని రోడ్లపై తిప్పుతూ దారుణంగా కొట్టాడు. ఎస్‌వోటీ పోలీసులకు అప్పగిస్తామని బెదిరించాడు. తనకు పది లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రదీప్ తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఓయూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here