ఆస్తి కోసం ఘాతుకం.. అత్తమామలను గొంతు కోసి చంపేసిన కోడలు

ఆస్తి కోసం ఓ మహిళ అత్తమామలనే కడతేర్చిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. దక్షిణ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో రాజ్‌సింగ్(61), ఓమ్‌వతి(58) అనే వృద్ధ దంపతులు కొడుకు సతీశ్ సింగ్, కోడలు కవిత, ఇద్దరు మనవళ్లతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి రాజ్‌సింగ్, ఓమ్‌వతి హత్యకు గురైనట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఓ గదిలో వారిద్దరు విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

వారిద్దరిని కత్తితో గొంతు కోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. కోడలు కవిత తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కవిత కొన్నాళ్లుగా వేరే కాపురం పెట్టాలని చూస్తోందని, ఆస్తి రాసివ్వాలని అత్తమామలను కోరుతోందని తెలిసింది. అయితే వేరు కాపురానికి అత్తమామలు ఒప్పుకోకపోవడంతోనే ఆమె ఈ కిరాతకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనలో సతీశ్ హస్తం ఉందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో భార్యభర్తలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here