‘ఆరోగ్యసేతు తప్పనిసరిగా వాడాలని చెప్పడం చట్టవిరుద్ధం’

ఆ రోగ్య సేతు యాప్‌ వినియోగం అంశంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాప్‌ను తప్పనిసరిగా వాడాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఈ యాప్‌ను తప్పనిసరి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఏ చట్టం కూడా ఈ యాప్‌ను సమర్థించట్లేదని పేర్కొన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రతి ఒక్కరూ యాప్‌ను తప్పనిసరిగా తమ మొబైళ్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఈ యాప్ లేకుండా ఎవరూ ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తరచూ హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఎవరి వద్దనైనా ఈ యాప్ లేకపోతే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.1000 వరకు జరిమానా విధిస్తామని నోయిడా పోలీసులు ఆదేశించారని.. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమని జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొన్నారు. ఇలాంటి ఆదేశాలను కోర్టుల్లో సవాలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ద్వారా జస్టిస్ శ్రీకృష్ణ తెలుగు వారికి సుపరిచితమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here