ఆఫ్రికర్ స్వైన్ ఫీవర్: పందుల్లో మాయ రోగం.. 13 వేలు మృతి

క రోనా వైరస్ ఓ వైపు కరాళనృత్యం చేస్తుండగా.. ఈశాన్య రాష్ట్రం అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అలజడి రేపుతోంది. ఈ వైరస్ కారణంగా అసోంలో సుమారు 13 వేల పందులు మృత్యువాతపడ్డాయి. 9 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు తెలిపారు. వైరస్ నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన అసోం ప్రభుత్వం కేసులు పెరుగుతుండటంతో మరింత అప్రమత్తమైంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సాయం కోరింది.

అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పందుల పెంపకం ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ రాష్ట్రాల్లో పంది మాంసానికి డిమాండ్ ఉండటమే అందుక్కారణం. అసోంలో సుమారు 30 లక్షల పందులు ఉన్నట్లు అంచనా. అయితే.. ఇన్‌ఫెక్షన్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో అసోంలో ఆందోళన నెలకొంది.

ఎక్కడ పుట్టింది? భారత్‌కు ఎలా వచ్చింది?

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌ను తొలిసారిగా 1921లో ఆఫ్రికాలో గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ వ్యాధి బయటపెడింది. చైనాలోని జినియాంగ్ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న అసోంకు అక్కడ నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఫిబ్రవరిలో ఈ వైరస్ అసోంకు విస్తరించింది.

Don’t Miss:

ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదని అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో మరో రెండు నుంచి రెండున్నరేళ్ల వరకు ఈ వైరస్ యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నుంచి పందులను కాపాడటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ పిగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌తో కలిసి పనిచేయాలని పశుసంవర్ధక శాఖ అధికారుల‌ను అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆదేశించారు.

పందులు తినే ఆహారం, దాని లాలాజలం, రక్తం ద్వారా ఇతర పందులకు ఈ వైరస్ వ్యాపిస్తుందని అధికారులు తెలిపారు. వ్యాధి నియంత్రణకు అసోం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆఫ్రికా స్వైన్ ఫీవర్ బారిన పడిన, ఆ లక్షణాలున్న పందులను గుంపుతో కలవకుండా ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైరస్ ఉన్న పందులను రోడ్లపై తిరగకుండా చర్యలు చేపట్టారు. పందుల సంరక్షకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ వైరస్ మనుషులకు సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా కొంత మంది భయపడుతున్నట్లు స్వైన్ ఫ్లూతో దీనికి ఏమాత్రం సంబంధం లేదు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here