ఆఫీస్‌ బాస్‌తో ప్రేమ, పెళ్లి.. ఐదు నెలలకే యువతి..

ఆఫీస్‌లో మేనేజర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి(25) ఐదు నెలలు తిరక్కుండానే ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన వెలుగుచూసింది. వరకట్న వేధింపుల కారణంగానే యువతి సూసైడ్ చేసుకుని చనిపోయిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే తన సోదరి చనిపోయిందని మృతురాలి అన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది.

ఫేజ్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 11.15 గంటల సమయంలో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఘజియాబాద్‌లో ఉంటున్న యువతి సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో మృతురాలి బంధువులు నోయిడా చేరుకున్నారు.

Also Read:

వరకట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు గురిచేయడంతోనే తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి అన్న ఆరోపించారు. ఐదు నెలల క్రితమే గత నవంబర్‌లో ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని మేనమామ తెలిపారు. ఇద్దరూ నోయిడాలో ఒకే ఆఫీస్‌లో ఉద్యోగం చేసేవారని, మేనేజర్‌‌గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పారు. ఇరుకుటుంబాలను ఒప్పించి ఇద్దరూ వివాహం చేసుకున్నారని ఆయన తెలిపారు.

Read Also:

కొద్దికాలం బాగానే ఉన్నా వరకట్న వేధింపులు మొదలయ్యాయని, అత్తమామలు కట్నం కోసం వేధింపులకు గురిచేశారన్నారు. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆరోపించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపులు, గృహ హింస తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి భర్త కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకున్నట్లుగానే ఉందని.. అయితే ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ రావాల్సి ఉందని.. విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here