అమెరికాకు చైనా షాక్.. W.H.O.కు భారీగా నిధులు

క‌రోనా వైర‌స్ విస్త‌రించిన క్ర‌మంలో చైనా, అమెరికా దేశాల మ‌ధ్య సంబంధాలు క్షీణించిన సంగ‌తి తెలిసిందే. చైనాలో క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లిన క్ర‌మంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించింద‌ని అమెరికా ఆరోపిస్తూ, ఆ సంస్థ‌కు నిధులు క‌త్తిరించింది. ఈ నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్ఓకు భారీ ఆర్థిక సాయాన్ని తాజాగా డ్రాగ‌న్ కంట్రీ ప్ర‌క‌టించింది. క‌రోనాపై పోరులో భాగంగా 30 మిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు చైనా విదేశాంగ అధికార ప్ర‌తినిధి గెంగ్ షువాంగ్ ప్ర‌క‌టించారు.

Must Read:

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌పై పోరాటానికి ఇప్ప‌టికే 20 మిలియ‌న్ డాల‌ర్ల సాయాన్ని ప్ర‌క‌టించిన‌ట్లు గుర్తు చేసిన షువాంగ్‌.. తాజాగా మ‌రో 30 మిలియ‌న్ డాలర్ల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపారు. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లో హెల్త్ సిస్ట‌మ్‌ను మెరుగుప‌ర్చేందుకు సంస్థ‌కు ఈ నిధులు ఉప‌క‌రించ‌గ‌ల‌న‌వి ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Must Read:

డ‌బ్ల్యూహెచ్ఓపై త‌మ ప్ర‌భుత్వానికి ఉన్న‌ మ‌ద్ద‌తును, న‌మ్మ‌కాన్ని ఈ చ‌ర్య‌ల ద్వారా వ్య‌క్తం ప‌రుస్తామ‌ని హువాంగ్ తెలిపారు. ఇక చైనాకు వ‌త్తాసు ప‌లుకుతుంద‌ని పేర్కొన్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. సంస్థ‌కు ఇచ్చే నిధుల‌ను నిలిపివేశారు. ప్ర‌తి ఏడాది సుమారు 400-500 మిలియ‌న్ డాల‌ర్ల నిధుల‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు త‌మ దేశం అందిస్తోంద‌ని అమెరికా గుర్తు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here