అప్పు కట్టకపోతే ఆ కోరిక తీర్చు.. ఉయ్యూరులో దారుణం

లాక్‌డౌన్‌లో ఓ వడ్డీ వ్యాపారి రెచ్చిపోయాడు. తన వద్ద తీసుకున్న అప్పు వెంటనే తీర్చాలని.. లేకుంటే తన కోరిక తీర్చాలంటూ మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగని ఆ దుర్మార్గుడు ఆమె కూతురిని హాస్టల్‌లో వదిలేసి తనతో వచ్చేయాలని ఆఫర్ కూడా ఇచ్చాడట. ప్రతిఘటించినందుకు మహిళతో సహా ఆమె తమ్ముడిని చితకబాదాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన ఈ అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉయ్యూరుకి చెందిన మహిళ వడ్డీ వ్యాపారి వద్ద కొంతమొత్తం అప్పుగా తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా తిరిగి చెల్లించలేకపోవడంతో కాల్‌మనీ వ్యాపారి బుసలు కొట్టడం ప్రారంభించాడు. తన అప్పు వెంటనే చెల్లించాలని.. లేకుంటే తన కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. కూతురిని హాస్టల్‌లో ఉంచి తనతో వచ్చేయాలని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ బాధితురాలు ఆరోపిస్తోంది.

Also Read:

అర్ధరాత్రి వేళ ఇంటి తలుపులు కొట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని.. ప్రతిఘటించడంతో తనను, తన కూతురిని, సోదరుడిని చితకబాదాడని ఆమె చెబుతోంది. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని.. పోలీసులు కనీసం పట్టించుకోకపోగా అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయింది.

అర్థబలం దండిగా ఉన్న వడ్డీ వ్యాపారిని పోలీసులు కనీసం పిలిపించి విచారించలేదని.. పైగా సార్ అంటూ సంభోదిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని.. తన ఒక్కగానొక్క కూతురిని వెంటబెట్టుకుని ప్రాణభయంతో బతుకుతున్నానని ఆమె వాపోయింది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here