అనుమానంతో భార్యని చంపేసి భర్త హైడ్రామా.. పోస్టుమార్టం రిపోర్ట్‌‌లో షాకింగ్ నిజాలు

మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన భర్త హైడ్రామాకు తెరతీశాడు. భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని నమ్మించాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ కోసం వేచిచూశారు. తీరా ఖాకీల అనుమానమే నిజమైంది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జిల్లాలో వెలుగుచూసింది.

భోపాలపట్నం మండలం భట్టపల్లికి చెందిన కామేశ్వర్ దుర్గం భార్య భాగ్య శ్రీ(22) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీంని పిలిపించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.

Also Read:

భాగ్య శ్రీ ఆత్మహత్య వ్యవహారంపై అప్పటికే అనుమానంతో ఉన్న పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ చూసి షాక్‌కి గురయ్యారు. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని.. దారుణంగా హత్య చేసి ఉరికి వేలాడదీసినట్లు తేలడంతో అనుమానాలు బలపడ్డాయి. వెంటనే ఆమె భర్త, అత్తమామాలను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేశారు. ఆమెను దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించినట్లు ఒప్పుకున్నారు.

కొద్దికాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న కామేశ్వర్ భార్యను గొంతునులిమి చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని ఉరికి వేలాడదీసి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు భోపాలపట్నం పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here