అది హత్య కాదట జార్జ్ మృతిలో అసలు ట్విస్ట్ ఇదే…. ?

అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఘటన అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తుంది. నల్ల జాతీయుడు పై వివక్ష చూపి దారుణంగా అతడి మెడపై పోలీసులు కాలు మోపినొక్కి పెట్టి కుదిపేసి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మృతికేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

జార్జ్ కి  వైరస్ సోకినట్టు అటాప్సి రిపోర్టులో తేలింది. ఏప్రిల్ 3న పాజిటివ్ తేలినా లక్షణాలు మాత్రం కన్పించలేదు. అయితే ఊపరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో పాటు గుండె ధమనులు మూసుకుపోయినట్లు తెలిపారు. మొత్తం 20 పేజీల అటాప్సీ రిపోర్టును హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ విడుదల చేశారు. ఇందులో జార్జ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలోనే గుండెపోటు వచ్చిందని…ఆ కారణంతోనే జార్జ్ చనిపోయినట్లు వెల్లడించారు అధికారులు.

కాగా జార్జ్ ఫ్లాయిడ్ మరణం దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. దీంతో అమెరికా నల్లజాతి నిరసనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. నల్లజాతీయులు ఏకంగా తమ ఆందోళనలతో  వైట్ హౌస్ ను కూడా ముట్టడించారు. ఆందోళన కారుల దెబ్బకి వైట్ హౌస్ లో లైట్స్ కూడా ఆర్పేశారు. అలాగే అధ్యక్షుడు ట్రంప్ సైతం బంకర్ లోకి వెళ్లారు. ఆందోళనలు రోజురోజుకి ఉదృతంగా కొనసాగుతూన్న నేపథ్యంలో అమెరికాలో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ నిరసనల సెగ రాజధాని వాషింగ్టన్ ను కూడా తాకింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here