ఎండాకాలమే కదా అని బీర్ తెగ తాగేస్తున్నారా? ఆగండాగండి !

మండే ఎండల తాకిడి తట్టుకోవడానికి ఎండా కాలంలో శీతల పానీయాలకి అలవాటు పడడం సహజమే. కానీ మందు బాబులు మటుకు చల్లటి బీర్లు లాగించేయడానికి ఇదే అనువైన సమయమని భావిస్తున్నారు, సీసాల సీసాల బీర్లు కొట్టేస్తున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో బీర్లకు కొరత ఏర్పడుతుందని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

అసలు బీర్లు ఎక్కువగా సేవించడం వల్ల జరిగే దుష్పరిణామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.బీర్లను తాగితే శరీరం చల్లబడుతుందనేది మందు బాబుల లెక్క. కానీ ఆ చల్లబడడం అనేది కొద్దిసేపటి వరకే. ఆ తర్వాత బీరులో ఉన్న ఆల్కహాల్ శరీరంలో వేడిని పుట్టిస్తుంది. తద్వారా ఎక్కువ చెమట పట్టడం, అధికంగా దాహం వేయడం, నీళ్లు తాగకపోతే డీహైడ్రేష‌న్ సమస్యలు తలెత్తడం, అది కిడ్నీల పై కూడా భారం పెంచడం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ నష్టాలే.

అధికంగా బీర్లు సేవించడం వల్ల అందులోని గ్యాస్ అసిడిటీ ని కలిగించి, కడుపులో మంట పుట్టిస్తుంది. పేగుల్లో అలజడి తలెత్తి అల్సర్ కి దారి తీసే అవకాశం ఉంది. మరికొందరికి కడుపులో పుండ్లు కూడా ఏర్పడతాయి.

ఇక శాస్త్ర్హవేత్తల ప్రకారం అధికంగా బీర్లు సేవిస్తే శ‌రీరంలో ఉండే ఏడీహెచ్ అనే హార్మోన్ ప‌నితీరు మందగిస్తుంద‌ట‌. దీని వల్ల జీర్ణాశయం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

బీర్లలోని వేడి, విరోచనాలు పుట్టించి శ‌రీరంలో ఉండే ఎల‌క్ట్రోలైట్ల వంటి ముఖ్యమైన పోషకాలు బయటికి వెళ్ళిపోతాయని, తద్వారా అలసట, నీరసం కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

కాబట్టి బీర్లను అధికంగా సేవించే ముందు ఈ పరిణామాలన్నీ గుర్తు చేసుకొని తద్వారా ముందుకు సాగాలా లేదా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here