అత్త రాసలీలలకి అడ్డొచ్చిన అల్లుడు.. చంపేసిన కూతురు

అత్త అక్రమ సంబంధం అల్లుడి చావుకొచ్చింది. తన సహోద్యోగితో అత్త అక్రమ సంబంధం పెట్టుకుందని తెలియడంతో ఆగ్రహం చెందిన అల్లుడు పద్ధతి మార్చుకోవాలని చెప్పాడు. ఈ విషయమై కూతురితో గొడవ పడుతుండడంతో అల్లుడిని పక్కా ప్లాన్ చేసి మరీ అంతమొందించింది. కూతురితో కలసి అల్లుడిని దారుణంగా చంపేసింది. ఈ దారుణ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కూతురితో కలసి అల్లుడిని చంపేసిందో అత్త. జమ్మూకి చెందిన సుర్జీత్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఘజియాబాద్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే క్వార్టర్స్‌లో భార్య రషికతో కలసి నివాసం ఉండేవాడు. అతని భార్య రషిక తల్లి రమ రైల్వే టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న దేవేంద్ర అనే వ్యక్తితో పెట్టుకుంది. ఇద్దరూ రాసలీలలు సాగిస్తున్న విషయం అల్లుడు సుర్జీత్‌కి తెలియడంతో అడ్డుచెప్పాడు.

Also Read:

ఈ విషయమై తరచూ భార్యతో గొడవ పడేవాడు. వివాహేతర సంబంధం మానుకోవాలని హెచ్చరిస్తుండేవాడు. తన అక్రమ సంబంధానికి కూతురి సపోర్ట్ కూడా ఉండడంతో అల్లుడి మాటలు పట్టించుకోకుండా అత్త ప్రియుడితో రాసలీలలు సాగించేది. అదే విషయమై సుర్జీత్ మరోమారు భార్యతో గొడవ పడడంతో ముగ్గురూ కలసి అతనిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.

రాత్రి భోజనం అయిన తరువాత అత్త ఫోన్ చేసిందని ఆమె ఇంటికి వెళ్లాడు సుర్జీత్. అప్పటికే అక్కడ అత్త రమతో పాటు దేవేంద్ర ఉన్నాడు. వారితో మాట్లాడుతుండగా భార్య రషిక కత్తితో అతనిని వెనక నుంచి పొడిచేసింది. తలపై బలంగా కొట్టింది. అనంతరం అత్త, ఆమె ప్రియుడు కలసి సుర్జీత్‌ గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. శవాన్ని సుర్జీత్ క్వార్టర్స్‌కి సమీపంలోనే ఉన్న ఖాళీ క్వార్టర్స్‌లో పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి భార్య రషిక, అత్ రమ, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here