వలస కూలీలకు కేంద్రం మరో గుడ్ న్యూస్?

లాక్‌డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన సొంతూళ్లకు వెళ్లొచ్చని ప్రకటించిన కేంద్రం.. వారికి మరింత ఊరటనిచ్చే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రాలు ప్రత్యేక బస్సుల ద్వారా.. వలస కూలీలను తరలించొచ్చని స్పష్టం చేసిన కేంద్రం.. ప్రత్యేక రైళ్లను నడపడానికి మాత్రం అంగీకరించలేదు. కానీ రాష్ట్రాలు మాత్రం ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కూలీలను తరలించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. దీంతో ఈ విషయమై మోదీ సర్కారు ఆలోచనలో పడింది. 15 లక్షల మందిని బస్సుల్లో తరలించడం సాధ్యం కాదు కాబట్టి.. ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ప్రత్యేక రైళ్లను నడిపే విషయమై కీలక సమావేశం నిర్వహించిన రైల్వే శాఖ.. ప్రత్యేక రైళ్లను నడపడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మే 3 వరకు రైళ్లను నిలిపేసిన సంగతి తెలిసిందే.

వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలతోపాటు విద్యార్థులు, పర్యాటకులు, తీర్థయాత్రలకు వెళ్లిన వారు సొంత రాష్ట్రాలకు వెళ్లే అవకాశం కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని.. స్వస్థలాలకు వెళ్లిన తర్వాత వారిని హోం క్వారంటైన్లో ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇందుకోసం నోడల్ అధికారులను నియమించాలని రాష్ట్రాలకు సూచించింది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here