ధోనీ లేకపోతే ఇండియా కి కష్టం ..

ధోనీ కోసం భారత క్రికెట్ అభిమానులు పడి చస్తారు. అతను టీం లో ఉన్నాడు అంటే చాలు విపరీతమైన ఊపు , ఉత్సాహం వచ్చేస్తాయి. భావి తరాలకి అద్భుత పోరాట పటమి చూపించిన ధోనీ కెప్టెన్ గా రిజైన్ చేసిన సంగతి తెలిసిందే. అతన్ని చాంపియన్స్ ట్రోఫీ లో తీసేస్తున్నారు అనే న్యూస్ వస్తున్న నేపధ్యం లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సేవలెంతో అవసరమని, అతన్ని తప్పించాలని భావిస్తే అది పెద్ద పొరపాటు అవుతుందని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లాండ్ లాంటి దేశం లో టాప్ ఆర్డర్ అడ్డంగా ఫెయిల్ అయితే కాపాడేది మిడిల్ ఆర్డర్ అనీ ఆ ఆర్డర్ లో ధోనీ అంత బాగా ఎవ్వరూ ఆడలేరు అంటున్నాడు పాంటింగ్.ధోనీ లేకుంటే ఇండియా కష్టాలనుభవించాల్సి వస్తుందని తెలిపాడు. ఐపీఎల్ పోటీలు 20 ఓవర్లకే పరిమితం కాబట్టి, కుదురుకునేందుకు సమయం లభించక, ధోనీ ఆశించిన రీతిలో ఆడలేక పోతున్నాడని, వన్డే పోటీల్లో సమయం ఉంటుంది కాబట్టి ధోనీ చక్కగా రాణించగలదని పాంటింగ్ చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here