నా మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కాదు .. – పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా ఏది అంటే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అని ఎవ్వరైనా చెప్పేస్తారు. కానీ ఎన్నో సంవత్సరాల ముందరే దర్శకుడు కే విశ్వనాథ్ తీసిన శుభలేఖ చిత్రం తో తన తెరంగేట్రం జరిగింది అని అంటున్నాడు కళ్యాణ్ . ” మద్రాసు తీ నగర్ పోరూరు సోమ సుందరం వీధి లో చిరంజీవి అన్నయ్య వారి ఇల్లు ఉండేది. పక్క సందులో డబ్బింగ్ థియేటర్. విశ్వనాధ్ గారి సినిమా శుభలేఖ డబ్బంగ్ అక్కడ జరుగుతోంది. నా వయసు అప్పటికే పదహారు సంవత్సరాలు.

ఇంటి పక్కనే ఉన్న అన్నయ్య కి టీ ఇవ్వడం కోసం డబ్బింగ్ థియేటర్ కి వెళితే సర్వర్ పాత్ర చేసిన అన్నయ్య కి కో సర్వర్ గా నాతో డబ్బింగ్ చెప్పించారు. ‘మంచినీళ్ళు ఎక్కడ సార్‌?’ అనే చిన్న డైలాగ్‌ ఇచ్చారు. నేనూ చెప్పేశాను. ఇప్పటికీ ‘శుభలేఖ’ సినిమాలో నా గొంతులో ఆ డైలాగ్‌ వినచ్చు. ఆ తరవాత చాలా సంవత్సరాల కి హీరోగా ఎంట్రీ ఇచ్చాను ” అని చెప్పుకొచ్చాడు కళ్యాణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here