బాహుబలి చూసి పిచ్చోడు అయ్యాడు .. నిర్మాతలే డబ్బులు ఇవ్వాలి !

బాహుబలి కంక్లూజన్ సినిమా ని అందరూ పొగుడుతున్న ఈ టైం లో దానిని ఒక చెత్త సినిమాగా అభివర్ణించాడు బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్. అయితే అతని మీద ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ నుంచి సినిమా ప్రియుల వరకూ అందరూ సీరియస్ అవుతున్నారు. పబ్లిసిటీ వేషాలు తప్ప ఆ సినిమాకి ఏం తక్కువ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

” బాహుబలి 2 చిత్రం చూసి నచ్చని వారిని చూసి జాలి పడుతున్నా .. అతనికి మానసిక చికిత్స అవసరం. చిత్ర నిర్మాత శోబు యార్లగడ్డ ఔదార్యం చూపి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరించాలని నా మనవి” అని ట్వీట్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. బాహుబలి కుళ్ళు అనే జబ్బు అందరికీ పట్టుకుంటోంది అనీ చిత్ర నిర్మాతలు అందరికీ ఈ జబ్బు నయం అయ్యే వరకూ వైద్యం కోసం డబ్బులు ఇవ్వాలి అంటున్నారు వర్మ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here