వడదెబ్బ అంటే ??

మన శరీరం లో జరుగు రసాయన చర్యల వలన వేడి పుడుతింది.  అలా వుత్పత్తి అయిన “వేడి” మన శరీరం లో ని ఉష్ణ సమతుల్యత ని కాపాడుతుంది. తద్వారా శరీరా అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. మనం ఎప్పుడైతే ఎండలో తిరుగుతామో అప్పుడు మన శరీరము అధిక ఉష్ణొగ్రత, , డీహైడ్రేషన్ కి గురవుతుంది. దీంతో మనల్ని కాపాడే చర్మము, ఊపిరి తిత్తులు పనిచేయడం మానేస్తాయి. దీన్నే వడదెబ్బ అంటారు.
వ్యాది లక్షణాలు-
1. అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడి బారటం, దప్పిక ఎక్కువ అవ్వడం,
2. వాంతులు అవ్వడము,
3. నీరసం,
4. దడ, ఆయాసము, గుండె వేగంగా కొట్టుకోవడము,
5. కన్ ఫ్యూజన్, చిరాకు
6. చివరి గా స్పృహ కోల్పోవడము.
చికిత్స:
 1. మొదట బాధితుల్ని చల్లార్చే ప్రయత్నం చేయాలి. బట్టలు తీసి, చల్లని నీటి ఆవిరిని కాని, నీరు కాని మొత్తం శరీరం అంతా  తడపాలి.
2. చల్లని ఐస్ వాటర్ లో తడిపిన గుడ్డల్ని కప్పాలి.
3. భుజాలు కింద, గజ్జల్లో ను చల్లని ఐస్ ముక్కలు వుంచాలి..
వడ దెబ్బకి గురి కాకుండా తగు నివారణోపయాలు తీసుకుంటె చాలా మంచిది.. అవి ఏమిటి అంటే…
1. తరచుగా చల్లని నీరు త్రాగడం,
2. బయట పని చేసే వళ్ళు అప్పుడప్పుడు విరామం తీసుకోవడం…
3. సాధ్యమైన వరకు మిట్ట మద్యాహ్నం ఎండలో తిరగ కూడదు .
4. వేసవిలో తెల్లని వదులైన కాటన్క్ష్ దుస్తులు ధరించాలి .
5. మధ్యం సేవించకూడదు .
6. గదుల ఉష్ణోగ్రత తగ్గించే చర్యలు తీసుకోవాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here