వారిద్దరినీ దారుణంగా తోక్కేసిన రాజమౌళి ? ఎవరు వాళ్ళు అసలు ?

బాహుబలి ఫ్రాంచైజ్ కి మొదటి నుంచీ వర్క్ చేసిన టెక్నీషియన్ లు అందరికీ మంచి ప్రచారం లభించింది. వారి గురించి మీడియా లో ఎప్పుడూ లేనంతగా ఫోకస్ అయ్యింది. రాజమౌళి కైతే ప్రపంచం మెచ్చే పేరు వచ్చేసిది సంగీత దర్శకుడు కీరవాణి, కథకుడు విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, వీఎఫెక్స్ సూపర్ వైజర్లు శ్రీనివాస మోహన్, కమల్ కణ్ణన్ ఇలా అందరికీ తమ తమ స్థానాలు దక్కాయి. కానీ మాటల రచయిత విషయం లో మాత్రం అసలు పేరు రాలేదు. ఈ సినిమాకి మాటలు రాసింది ఎవరు అనేది సగం మందికి తెలీదు.
ఈ సినిమా కథ రాసేటప్పుడే దానికి తగ్గట్టుగా డైలాగ్ లు రాసిన వారు అజయ్ కుమార్ , విజయ్ కుమార్ కానీ వారికి అసలు పేరే రాలేదు. మీడియాకు కూడా వీళ్లు పరిచయం కాలేదు. ఈ సినిమా ప్రమోషన్లలోనూ వాళ్లు కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదిక మీద మాట్లాడలేదు కూడా. టైటిల్ కార్డ్స్ లో కూడా వీరి పేర్లు పడలేదు. రాజమౌళి ని ఈ విషయం లో అందరూ తప్పు పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here