సన్నీ లియాన్ తో బాగా క్లోజ్ అయిన హీరో రాజశేఖర్

టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల కిందట పెద్ద హీరోగా రాణిస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో రాజశేఖర్. కానీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచీ రాజశేఖర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరం చూస్తూనే ఉన్నాం.ఆయన సినిమాల్ని జనాలు పట్టించుకోవడమే మానేశారు. మూడేళ్ల కిందట వచ్చిన ‘గడ్డం గ్యాంగ్’ గురించి ఎవ్వరికీ తెలీదు. ఈ దెబ్బతో రాజశేఖర్ కెరీర్ కి తెర పడినట్టే అని అనుకున్నారు అందరూ. కానీ కాస్త గ్యాప్ తరవాత గరుడ వేగా అనే కొత్త ప్రాజెక్ట్ తో వచ్చాడు రాజశేకర్.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతోంది. షూటింగ్ కూడా ఆఖరు కి రాబోతోంది . ప్రస్తుతం సన్నీ లియాన్ తో డాన్స్ చేస్తూ ఐటెం సాంగ్ లో బిజీ ఉన్న రాజశేకర్ .. షూటింగ్ గ్యాప్ లో సన్నీ తో కబుర్లు చెబుతూ కహానీలు చేస్తున్నాడట. ఈ ఏజ్ లో సన్నీ తో ఐటెం సాంగ్ అంటే రాజశేకర్ కి పండగే కదా. కాస్తంత ఇంగ్లిష్ కూడా బాగానే వచ్చిన రాజశేఖరుడు సన్నీ లియాన్ తో బాగా క్లోజ్ గా ప్రవర్తిస్తున్నాడు అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. ఈ సాంగ్ షూట్ ముంబై లో సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here