యూరిన్ తో బీరు తయారీ..గుటకలేస్తూ తాగుతున్న మందుబాబులు

వాతావరణం హాట్ హాట్‌గా ఉన్నప్పుడు ఒక చ‌ల్లని బీర్ కొడితే ఎలా ఉంటుంది? ఆ మ‌జాయే వేరు క‌దా! అవును, మ‌రి. మ‌జాగానే ఉంటుంది. అయితే దాని టేస్ట్ తెలిసిన వారికే ఆ మ‌జా అందుతుంది. లేదంటే అంద‌దు.  అయితే ఈ బీరు రాను రాను తాగాలంటే వాంతులు వచ్చే పరిస్థితి కనబడుతుంది. పండ్ల రసాలతో తయారు చేసిన బీరు అంటే ఓకే తాగినోళ్లకి ఆ కిక్కు వేరుగా ఉంటుంది. కానీ యూరిన్ తో తయారు చేసే బీర్ ను తాగాలంటే వాంతలు రావాల్సిందే కదా. ప్రస్తుతానికి ఆచరణలో లేకపోయినా అందుకోసం పరిశోదనలు జరుగుతున్నాయి. బీరు తయారీ కష్టంగా ఉందనో..వ్యర్ధాల్ని ఉపయోగించుకుంటున్నాం.

యూరిన్ ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనో బెల్ గైన్ యూనివర్సిటీ శాస్త్రవేత సెబాస్టియన్ పరిశోదనలు చేస్తున్నారు. యూరిన్ ను వాటర్ ను శుద్ధి చేసి వాటితో బీరును తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ పరిశోదనలో భాగంగా బీరును పలువురుకి రుచిచూపించగా టేస్టీగా ఉందంటూ గుటకలేస్తూ తాగారని సెబాస్టియన్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే ఈ బీరు ప్రస్తుతానికి గార్డెనింగ్ లో ఉపయోగిస్తున్నామని..కొద్దిరోజుల్లో దీన్ని అమల్లోకి తెస్తున్నట్లు సెబాస్టియన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here