కుక్కకి టికెట్ తీసుకోలేదు అని ఫైన్ రాసారు .. ఎంతో తెలుసా

ఆగ్ర రైల్వేస్టేషన్ లో ఒక అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ కు  చెందిన ఒక యువకుడు ఢిల్లీ నుండి హైదరాబాద్ కు దక్షిణ ఎక్స్ ప్రెస్ లో తనతోపాటు బుల్లీ జాతికి చెందిన కుక్కపిల్లను తీసుకెళుతున్నాడు..అయితే ఇంతలోఆగ్రా లో రైల్వే అధికారులు అతన్ని పట్టుకుని టికెట్ అడగడం జరిగింది తాను టికెట్ చూపించాడు ఇంతలో రైల్వే అధికారి ఇంకో టికెట్ ఏదని అడిగాడు యువకుడు నేనొక్కడినే ప్రయాణం చేస్తున్న అని బదులిచ్చాడు మరి సంకలో ఉన్నదెవరు దానికి టికెట్ ఏది అని అడగటం జరిగింది.

కుక్కకు టికెట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దానికి టికెట్ తీసుకోని కారణంగా రూ.27.30 జీఎస్‌టీతో కలిపి రూ.575 జరిమానా విధించి పంపారు. కుక్కకి కూడా టికెట్ తీసుకోవాలని తెలియక ఆ యువకుడు తన ఒక్కడికే టికెట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆ కుక్కపిల్లను రూ.33,000కు కొన్నాడని, అతనికి దానిని ఇవ్వడానికి తాను రైల్లో ప్రయాణిస్తున్నానని ఆ యువకుడు చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here