గోదావరి జిల్లాల్లో బూతు డాన్స్ లు ..

తెలుగువారి పండుగలలో అతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగను  ఆంధ్రరాష్ట్రంలో కోనసీమ ప్రాంతంలో ప్రజలు చాలా అద్భుతంగా జరుపుకుంటారు.ఒకపక్క హరిదాసు కథలు మరోపక్క కోడిపందాలు,రికార్డింగ్ డ్యాన్సులు వంటి వాతావరణంలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అంతే కాకుండా ఈ పండుగకు పోలీసులకు చుక్కలు చూపిస్తారు కోనసీమ ప్రాంతవాసులు ఒకపక్క కోడి పందాలు నిర్వహిస్తూనే మరొక పక్క అశ్లీల నృత్యాలు రికార్డింగ్ డ్యాన్సులు అర్ధరాత్రి నిర్వహిస్తుంటారు.

వీటికి ప్రజా ప్రతినిధుల అండదండలు కూడా ఉండడంతో నిర్వాహకులు ఏ మాత్రం భయపడకుండా సంక్రాంతి వేడుకలను తమదైన శైలిలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా, తూర్పు గోదావరి జిల్లా, మల్కిపురం, తూర్పుపాలెం, శంకరగుప్తం, కేశనపల్లి, సఖినేటిపల్లి, మగటపల్లి, కరవాక గ్రామాలలో అశ్లీల నృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని తెలుస్తోంది.పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here