శిరీష ఆత్మహత్య చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఇదే ..

హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఆర్జీఏ స్టూడియో లో జరిగిన శిరీష అనుమానాస్పద ఆత్మహత్య విషయం లో ఇంటరాగేషన్ జరగగా అందులో రాజీష్ , శ్రవణ్ చెప్పిన నిజాలు షాకింగ్ గా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో తేజస్విని శిరీష మీద కేసు పెట్టిన తరవాత శ్రవణ్ కారణంగా శిరీష కి ఎస్సై ప్రభాకర్ రెడ్డి పరిచయం అయ్యారు. కేసు మాఫీ కోసం శిరీష కి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. అనేకసార్లు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తో మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి కేసు లేకుండా చేసేసారు.
ప్రభాకర్ రెడ్డి కి థాంక్స్ పార్టీ ఇవ్వడం కోసం హుక్కా తాగి అందరూ కలిసి ఫార్మ్ హౌస్ కి చేరుకున్నారు. మధ్యలో మందు బాటిల్స్ కూడా కొనుక్కుని మద్యం తాగి అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేసారు. పార్టీ మధ్యలో శిరీష మీద ప్రభాకర్ రెడ్డి లైంగికంగా దాడి చేసారు. దానికి ఆమె నో అనడం తో రాజీవ్ వెంటనే ఆమె ని కొట్టాడు. దానికి ఆమె నో చెప్పింది అనే కోపం తో రాజీవ్ ఇంకా తీవ్రంగా ఆమెని కొట్టాడు. దీంతో అవమానం భరించలేకపోయిన శిరీష స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇవీ ఇంటరాగేషన్ లో రాజీవ్, శ్రావణ పోలీసులకు వెల్లడించిన వివరాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here