‘నీ ఉద్యోగం ఊడింది..’పై క్షమాపణ చెప్పిన మహేంద్ర గ్రూప్ చైర్మన్, సీఈవో

ఐటీ ఉద్యోగం అనే ఒక డాలర్ డ్రీమ్ లాంటింది. ఓ టెక్కీ గా స్థిరపడాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. ఆఫీస్ వాతవరణం, పనిగంటలు, జీతభత్యాల విషయంలో ఐటీ సెక్టార్ మించింది మరేది లేదని అందరు అనుకుంటారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు హై లెవల్  శాలరీలు ఉన్నా పింక్ స్లిప్ విషయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి తిప్పలు అన్నీ ఇన్నీకావు. ఉద్యోగం ఊడబీకి  ఎప్పుడు ఇంటికి పంపిస్తారేమోనని భయపడుతుంటారు.
 తాజాగా టెక్ మహేంద్ర కంపెనీ ఉద్యోగికి సదరు హెచ్ ఆర్ కాల్ చేసి రేపటి నుంచి ఉద్యోగం రావొద్దు అంటూ 6.45 పాటు ఫోన్ సంభాషణ జరిపింది. ఆఫోన్ సంభాషణ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. హెచ్ ఆర్, ఉద్యోగికి మధ్య జరిగిన సంభాషణపై ఆనోటా ఈనోట నానడంతో మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టెక్ మహీంద్రా సీఈవో సిపి గుర్నానీలు శుక్రవారం క్షమాపణలు చెప్పాల్సివచ్చింది.
బెంగళూరుకు చెందిన టెక్ మహేంద్ర కంపెనీ చెందిన హెచ్ ఆర్ గుండా శ్రీ తేజ అనే యువతి జులై 15న తన సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగికి కాల్ చేసి నీ ఉద్యోగం పోయింది, నీవు రేపటి నుంచి ఆఫీస్‌కు రావొద్దని చెప్పింది. అంతే హెచ్ ఆర్ మాటలకు షాక్ తిన్న ఉద్యోగి ఏం చేయాలో పాలుపోక షడన్ గా ఫోన్ చేసి జాబ్ కు రావొద్దు అంటే ఎలా ..ఒక్కరోజులో ఉద్యోగం ఎలా చూసుకోవాలి అని ఆ ఉద్యోగి హెచ్ ఆర్ ను ప్రశ్నించాడు.
ఆ విషయం తనకు సంబంధంలేదని కార్పొరేట్ ఆఫీస్ యాజమాన్యం మిమ్మల్ని రావొద్దని చెప్పమన్నది అంటూ మాట్లాడింది. ఈ ఫోన్ సంభాషణను బాధిత ఉద్యోగి ఫోన్ లో  రికార్డు చేసి నెట్టింట్లో పోస్ట్ చేశాడు.  ఈ విషయం భయటకు పొక్కడంతో మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టెక్ మహీంద్రా సీఈవో సిపి గుర్నానీలు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. ఉద్యోగి విషయంలో జరిగిన తప్పిదంపై ఆలోచిస్తామని అన్నారు.
ఇదిలా ఉంటే మహేంద్ర గ్రూప్ ఛైర్మన్ పై ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రతీ ఒక్కరు మండిపడుతున్నారు. కష్టకాలంలో ఉద్యోగస్థుల్ని కాపాడుకోవాల్సింది పోయి ఇలా గాలికి వదిలేయడం సమంజసం కాదని కామెంట్లు చేస్తున్నారు. వీరికి మద్దతుగా తెలంగాణ ఇన్మర్ మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతు..ఉద్యోగుల్ని ఇలా వేదించడం సరికాదని ల్యాబర్ లా ప్రకారం కోర్టును ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామి ఇచ్చారు.
https://www.youtube.com/watch?v=WjQHnMO3_eQ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here