దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీ అతుకుల బొంతలా మారింది. వర్గపోరులో ఎవరికి వారు చీలిపోయారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి, శిశకళ ఇలా మూడు వర్గాలు చీలిపోయి రాజకీయం చేస్తున్నారు. మరి అమ్మ వారసురాలు ఎవరైనా ఉన్నారంటే ఎవరికి తెలియదు. దీంతో తామె అమ్మకు వారసులం అంటూ జయ సోదరుడు కుమార్తె దీప, ఆయన కుమారుడు దీపక్ కూడా వేర్వేరుగా రాజకీయాల్లో దిగారు. అయితే తాజాగా తాను ఎంజీఆర్- జయలలితలు పెళ్లి చేసుకున్నారని, తాను వారిద్దరికే పుట్టానంటూ ప్రియా మహాలక్ష్మీ అనే మహిళ తెరపైకి వచ్చింది.
ఇన్నిరోజులు మన్నార్ గుడి మాఫియాకు భయపడిరాలేదని చెప్పింది. ఒకవేళ జయలలిత గురించి మాట్లాడితే తనను చంపేస్తానని శశికళ బెదిరించిందని అందుకే ఇన్నిరోజులు తలమరుగైనానని అన్నది. ఇకపై భయపడకూడదంటూ.. ధైర్యం చేసుకుని బయటికి వచ్చానని వెల్లడించారు. అంతేగాకుండా తాను ఓ నకార్మీకుల సంఘానికి చెందిన పార్టీకి కోశాధికారిగా ఉన్నానని కూడా తెలిపారు. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది.
