నాగార్జున దర్శకుడి కూతురితో అఖిల్

అఖిల్ తన మొదటి సినిమా ఫెయిల్యూర్ తో.. కెరీర్ పై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. సినిమా కథ, దర్శకుడి విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. తండ్రి నాగార్జున కూడా.. తన అనుభవాన్ని ఈ సినిమా కోసం రంగరించి మరీ.. అఖిల్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందనన్న ప్రచారం జరుగుతోంది.

నాగార్జునతో.. గతంలో నిర్ణయం లాంటి సూపర్ డూపర్ హిట్ ను ఇచ్చిన దర్శకుడు.. ప్రియదర్శన్. ఆమె కూతురు కల్యాణి.. తండ్రి బాటలో దర్శకురాలు కావాలని ఆరాటపడింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసింది. కానీ.. ఆమె హీరోయిన్ గా తన కెరీర్ ను మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు.. అఖిల్ హీరోగా మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది.

అందులో హీరోయిన్ గా.. కల్యాణి పేరును పరిశీలిస్తున్నారని.. ఈ సినిమా మాంచి లవ్ కమ్ రొమాంటిక్ ఎంటర్ టైనింగ్ గా రూపొందబోతోందని అంటున్నారు. స్వయంగా నాగార్జునే కల్పించుకుని సినిమా చేయిస్తున్నాడు కాబట్టి.. కల్యాణి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం పెద్ద పనేం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో.. తన కొత్త సినిమా కోసం ఇంత తపన పడుతున్న అఖిల్.. హిట్ అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ కూడా సంబరపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here