జై..ఇంత రచ్చ చేస్తే.. లవ, కుశ ఇంకెంత చేస్తారో!!

ఎన్టీఆర్ హీరోగా.. ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న సినిమా జై లవకుశ. ఈ సినిమా టీజర్ ఈ మధ్యే రిలీజ్ అయ్యింది. ఇందులో జై క్యారెక్టర్ కు సంబంధించిన ఓ డైలాగ్.. అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆ రావణుడిని సంపాలంటే.. సముద్రం దాటాలా.. ఈ రావణుడిని సంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాలా.. ఉందా.. అంటూ జై కేరెక్టర్ లో ఎన్టీఆర్ చెబుతున్న డైలాగ్.. రోమాంఛితంగా ఉంది.

ఇంత అద్భుత ఆహార్యాన్ని చూపిస్తున్న ఎన్టీఆర్.. లవ, కుశ కేరెక్టర్లలో మరింత రాజసమైన నటన ప్రదర్శించాడని జై లవకుశ టీమ్ చెబుతోంది. ఇప్పుడు చూసింది కేవలం షాంపిల్ మాత్రమే అని సినిమా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీంతో.. ఎన్టీఆర్ అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.

సినిమా కంటే ముందు.. లవ, కుశ కేరెక్టర్లకు సంబంధించిన టీజర్లను కూడా చూసేయాలన్న ఆరాటాన్ని ఫ్యాన్స్ చూపిస్తున్నారు. మరి.. టీజర్లను.. సినిమా యూనిట్ ఎప్పుడు చూపిస్తుందో. ఎన్టీఆర్ కోసం ఆ మాత్రం వెయిట్ చేయాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here