బండ్ల గణేష్ జైలు శిక్ష వెనక టీడీపీ హస్తం ? !!

హాస్యనటుడు, టాలీవుడ్ నిర్మాత, పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్ల గణేష్ కి ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే . జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమాకు కథ రాసిన వక్కంతం వంశీకి రెమ్యున‌రేషన్ గా ఇచ్చిన చెక్ బౌన్సు అవ్వడంతో  ఆయన కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో ఇద్దరు వాదనలు విన్న న్యాయస్థానం తన తీర్పును వెల్లడించింది..నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సంచలనం కలిగించే వార్త పుట్టుకొచ్చింది… అదేంటంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల తీరుపై బండ్ల గణేష్ ప్రభుత్వాన్ని తీవ్రమైన పదజాలంతో దూషించారు…ఇచ్చినవి నంది అవార్డులు కాదని, సైకిల్‌ అవార్డులంటూ ఎద్దేవా చేశారు.శాసనసభ నేతగా, జ్యూరీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఉత్తమ నటుడి అవార్డు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
ఇండస్ట్రీకి సగం లాభం తీసుకువచ్చే మెగా కుటుంబాన్ని అవమానించారన్నారు… చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారని విచారించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలే గణేష్ చెక్ బౌన్సు కేసును బయటకు తవ్వుకోచ్చారు అనీ  బండ్ల గణేష్ కు  జైలు శిక్ష ప‌డేలా చేశార‌ని సోష‌ల్ మీడియాలో వార్త చక్కర్లు కోడతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here