పవన్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ అజ్ఞాతవాసి కానే కాదు !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న పవన్ 25 వ చిత్రం టైటిల్ ఇంకా బయటకు చెప్పకపోవడం  దారుణం అంటున్నారు అభిమానులు. ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ కు విచిత్రమైన అలవాటు  ఉంది ..తాను కథ రాస్తున్నప్పుడే టైటిల్ సిద్ధం చేసుకుంటారు కాని ఆ టైటిల్ని స్క్రిప్ట్ మీద రాయరు అంతేకాదు తన మనసులో దాచుకున్న టైటిల్ని షూటింగ్ చివరి వరకూ చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గత చిత్రాలైనా జులాయి, అత్తారింటికి దారేది, సన్ అఫ్ సత్యమూర్తి.. సినిమాలు జరుగుతున్నపుడు పదులు సంఖ్యలో టైటిళ్ళు వినిపించాయి. కానీ ఆయన మాత్రం చివరాకరకు  మౌనంగా గా ఒక టైటిల్ ను ఫిక్స్ చేస్తారు.
ప్రస్తుతం తాను  పవన్ కళ్యాణ్ తో తీస్తున్న  సినిమా విషయంలో కూడా ఇదే పంత మౌనాన్ని కొనసాగిస్తున్నాట్టు  కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి చాలా టైటిల్స్ వినబడుతున్నాయి దేవుడే దిగివచ్చినా’, ‘ఇంజనీర్‌ బాబు’ ‘ గోకుల కృష్ణుడు’.. ఇలా బోలెడు టైటిల్స్, ఫ్యాన్ మేడ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి….అయినా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుండి ఎటువంటి  ప్రకటన రాలేదు టైటిల్ సంబంధించి. ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ కి ఫిక్స్ అయిపోయారంతా.
ఆ టైటిల్ తోనే వార్తలు రాస్తుంది మీడియా. దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా మీడియా మాత్రం ఆసినిమాకి ఆ టైటిల్ ఫిక్స్ చేసేసింది.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది.. ఈనెల 27న ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత ఒక ప్రీ లుక్ ను విడుదల చేశారు….ఈ నేపథ్యంలో త్రివిక్రమ్  అభిమానులకు ఏ టైటిల్ తో సర్ ప్రైజ్ ఇస్తారో  అని తెలుగు సిని ప్రేక్షకలోకం ఎదురు చూస్తుంది . మొత్తం మీద అజ్ఞాత వాసి మాత్రం పవన్ సినిమా టైటిల్ కానే కాదు అని కొందరు కుండ బద్దలు కొడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here