మాజీ ముఖ్యమంత్రి ని ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా మినిమం కేర్ చెయ్యడం లేదు !

సమైక్యాంధ్ర రాష్ట్ర  చివరి ముఖ్యమంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి తమ్ముడు  కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ కండువ్వ కప్పుకున్న సంగతి తెలిసిందే .రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన తాజాగా టీడీపీ లో జేరారు. అయితే తాను  తెలుగుదేశంలో చేరడం తన అన్నకు ఇష్టమా కాదా అనే విషయం పై రకరకాల వార్తలు వేలువడుతున్నయి . తమ్ముడు తెలుగుదేశంలో కి వెళ్ళడం కిరణ్ కుమార్ రెడ్డి కి ఇష్టం లేదు అంటూ మీడియా లో వార్తలు వస్తున్నయీ …ఓ ప్రముఖ మీడియా అయితే కుటుంబంలో జరిగే ఏ వేడుకకు తమ్ముడిన్ని పిల‌వ‌కూడ‌ద‌ని కిరణ్ కుమార్ రెడ్డి  నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌థ‌నం రాసేసింది వాస్తవంగా కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని అంతగా వ్యతిరేకించారా  అంటే కాదాన్ని చెప్పాలి.
రాష్ట్రస్థాయి నాయకుడిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి చిన్నప్పటినుండి ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే ఉండేవారు.. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి  చూసుకునేవాడు. రాష్ట్ర విభజన అనే అంశం కిరణ్ రాజకీయ జీవితానికి చాలా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. గత ఎన్నికల సమయంలో స్వంతంగా సమైక్యాంధ్ర పార్టీ పెట్టినా .ఆశించిన స్థాయిలో దానికి గుర్తింపు రాలేదు.. దాని తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గడచిన కొద్ది దినాలుగా ఆయన రాజకీయ రీ ఎంట్రీపై వార్తలు వినపడుతూనే ఉన్నాయి.. ఈ క్రమంలో టిడిపిలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది.అయితే పరిస్థితుల బట్టి చూస్తే ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కిరణకుమార్ రెడ్డి రాష్ట్ర స్థాయి నాయకుడు ఏ పార్టీలో చేరిన ఆ స్థాయి గౌరవం ఆశిస్తారు.
ఇప్పుడు కిరణ్ ముందు రెండు దారులు ఉన్నాయి ఒకటి టిడిపి  అయితే మరొకటి వైయస్ఆర్సీపీ.వైకాపాలోకి వెళ్ల‌ర‌నేది సుస్ప‌ష్టం. ఇక‌, టీడీపీలో కిర‌ణ్ చేరినా.. రాష్ట్ర స్థాయి నాయ‌కుడి గుర్తింపు ఆయ‌న‌కు టీడీపీ అధినాయ‌క‌త్వం క‌ట్ట‌బెడుతుంద‌నే న‌మ్మ‌కం లేదు.ప్రస్తుతానికి   అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలోనూ చేరడానికి ఇష్టపడటంలేదు. టిడీపి కూడా కిరణ్ ని  లైట్ తీసుకుంది. అసలు టీడీపీ ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి ని ఏ పార్టీ వారూ తీసుకోవడం కోసం ఇష్టపడడం లేదు. దీన్ని బట్టి చూస్తే మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీవైపూ వెళ్లే ప‌రిస్థితి ప్ర‌స్తుతం క‌నిపించ‌డం లేదనే అనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here