హైదరబాద్ లో బైక్, కార్ తోలుతున్నారా ? ఇది చదవండి

ట్రాఫిక్ ఉల్లంఘన లు పెరుగుతున్న హైదరాబాద్ , తెలంగాణా ప్రాంతాలలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వం వీటి నివారణ కి సిద్దం అవుతోంది. మోటార్ వాహనాల చట్టాన్ని , వాటి నిబంధనలని సైతం సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణల కి పెనాల్టీ పాయింట్ ల విధానం ప్రవేశ పెడుతోంది. దీంతో ఇదివరకు లాగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి డబ్బులు కట్టి తప్పించుకోవడానికి లేదు. ప్రతీ వాహన దారుడు కీ ఒక్కొక్క ట్రాఫిక్ ఉల్లంఘన తరవాత పాయింట్ లు నమోదు అవుతాయి.
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ఒక పాయింట్ , రాంగ్ రూట్ లో వెళితే రెండు పాయింట్ లూ ఇలా ఒక్కొక్క దానికీ ఒక్కొక్క పాయింట్ ఇస్తారు. ఈ పాయింట్ లు రెండేళ్ళ టైం లో 12 పాయింట్ లు దాటితే డ్రైవింగ్ లైసెన్స్ ని సైతం రద్దు చేస్తారు. ఆ తరవాత కూడా ఇదే కొనాసగితే ప్రతీ ఏడాదీ రద్దు పోడిగిస్తారు.లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వారు దాని చెల్లుబాటు వ్యవధిలో 5 పెనాల్టీ పాయింట్లు కనుక ఎదుర్కొంటే లైసెన్స్ రద్దయిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here