బాహుబలి 2 మీద కోర్టుకు వెళ్ళిన ప్రేక్షకులు !

బాహుబలి 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు అందరూ  విపరీతంగా ఎదురు చూస్తున్న ఈ పరిస్థితి లో ప్రేక్షకుల సంఘం ఈ సినిమా మీద సీరియస్ అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా కి రోజుకి ఆరు షో లు అనుమతి, తెలంగాణా ప్రభుత్వం రోజుకి ఐదు షో ల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని మీద ప్రేక్షకుల సంఘం వారు కోర్టుకి వెళ్ళడానికి సిద్దం అవుతున్నారు.

ఈ రోజు ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధకు ఓ విన్నపం చేసుక‌ున్నారు. ఏపీ సర్కారు జారీ చేసిన ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు. థియేటర్ లలో షో ల ప్రదర్శన కోసం చట్టం లో స్పష్టంగా ఆదేశాలు ఉండగా రాత్రి ఒంటిగంట తరవాత షో లు ఎలా వేస్తారు అంటూ ప్రేక్షకుల సంఘం అధ్యక్షురాలు అనురాధ మీడియా తో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఈ అంశం మీద సర్కారు స్పందించకపోతే కోర్టుకి వెళ్లి తీరతాం అన్నారు ఆమె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here