సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో రూ.500 ఫోన్

రిలయన్స్ జియో పరిచయం అక్కర్లేని పేరు. రకరకాల ఆఫర్లు, ఫ్రీ డేటాతో టెలికాం రంగంలో అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కష్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్తకొత్త ఆఫర్లు ప్రకటించింది. దీంతో జియో కష్టమర్లు విపరీతంగా పెరగిపోయారు. జియో దెబ్బకు మిగిలన టెలికాం రంగసంస్థలు ట్రాయ్ ను ఆశ్రయించాయి.
ఫ్రీ ఆఫర్లతో తట్టుకోలేకపోతున్నామని కోరగా జియో కు కొంతబ్రేక్ పడింది. అయినా మళ్లి పుంజుకొని మార్కెట్లో సరికొత్త సంచలనాలను సృష్టించింది. తాజాగా జియో గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.   కంపెనీ లెక్కల ప్రకారం ఏప్రిల్ 2017 నాటికి జియో నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్న వారి సంఖ్య 112.55 మిలియన్లుగా ఉంది.
వారిని పెంచుకునే పనిలో భాగంగా రిలయన్స్ సంస్థ 4G VoLTE అనే సరికొత్త ఫోన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీని దర రూ.500మాత్రమే ఉండొచ్చనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోన్ గురించి మరింత స్పష్టత ఇచ్చేందుకు  జూలై 21న ముంబైలో జరగబోయే రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అన్నీ బాగుంటే జూలై చివరా లేదా ఆగష్టు మొదటి వారం నాటికి ఈ ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఫీచర్స్ :  2జీ నెట్‌వర్క్ ,
4G VoLTE
ధర రూ.500
Spreadtrum ప్రాసెసర్
చైనాకు చెందిన Spreadtrum Communications ప్రాసెసర్‌
4G VoLTE ఫీచర్ ఫోన్‌లతో పాటు రూ.80, రూ.90 రేంజ్‌లో కొత్త టారిఫ్ ప్లాన్‌ లు అందుబాటులోకి రానున్నాయని జియో ప్రతినిధులు వెల్లడించారు.
http://gadgets.ndtv.com/mobiles/news/jio-feature-phone-price-launch-date-4g-volte-1720838

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here