రేడియో జాకీ సంధ్య చావు వెనకాల మిస్టరీ ..

రెండు వారాల నుంచీ సంచనలనం సృష్టిస్తున్న రేడియో జాకీ సంధ్య ఆత్మహత్య కేసు లో ఆమె భర్త మాజీ ఆర్మీ మేజర్ అయిన వైభవ్ ని అరస్ట్ చేసారు పోలీసులు . ఆమ మరణించిన తరవాత అనారోగ్యం తో అతను ఐ సి యూ లో జాయిన్ అయ్యాడు. ఆర్మీ 54 ఇన్ ఫ్యాంట్రీ డివిజన్ మేజర్ వైభవ్ ఆరోగ్యం కుదుటపడిందని సైనిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించగానే, ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.  సైనిక అధికారులు స్వయంగా అతన్ని పోలీసులకి అప్పగించారు.

భర్త వేధింపులు భరించలేక ఆమె చనిపోయింది అని సంధ్య తల్లి తండ్రులు అంటున్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ జంట రెండేళ్ళ క్రితం హైదరాబాద్ లో ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. మరణించడానికి కొన్ని రోజుల ముందు తను విపరీతమైన ప్రెజర్ లో ఉన్నాను అనీ తనకి బతుకు మీద ఆశ కూడా లేదు అని రేడియో చానల్ లో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు కొందరు చెప్పినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here