పెళ్ళాన్ని చంపేయడానికి ఏం స్కెచ్ వేసాడు రా బాబోయ్ !

భార్యను వదిలించుకోవడానికి ఓ భర్త చేసిన యత్నం… చివరకు అతన్నే బలి తీసుకుంది. ఈ ఘటన పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, అన్వర్ మసీహ్ (29), కోమల్ (26)ల వివాహం 2010లో జరిగింది. గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, భార్యను చంపాలని అన్వర్ నిర్ణయించాడు. తన తమ్ముడు నాచ్ తార్ తో కలసి ప్లాన్ వేశాడు.

ప్లాన్ లో భాగంగా భార్య, తమ్ముడితో కలసి బుధవారం సాయంత్రం గ్రామానికి సమీపంలో ఉన్న కాలువ వద్దకు అన్వర్ వెళ్లాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలసి ఆమెను కాలువలోకి తోసేశారు. అయితే, అప్రమత్తమైన ఆమె… కాలువలో పడకుండా చెట్టును పట్టుకుంది. దీంతో, అన్వర్ నీటిలోకి దూకి, ఆమెను లోపలకు లాగే ప్రయత్నం చేశాడు. అయితే, ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ప్రమాదవశాత్తు అన్వర్ నీటిలో కొట్టుకుపోయాడు. భయంతో అక్కడి నుంచి నాచ్ తార్ పారిపోయాడు. కోమల్ అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని, అన్వర్ డెడ్ బాడీ కోసం గాలింపు చేపట్టారు. ఇంతవరకు అన్వర్ మృతదేహం లభించలేదు. పోలీసులు కూడా గాలిస్తూనే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here