పాలు పొంగితే ఎన్నిలాభాలో తెలుసా?

కొత్తింట్లో పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా అని అడిగితే తెలియని వాళ్లు బిక్కమొహం వేసుకొని చూస్తారు. అదే తెలిసినవాళ్లను అడిగితే వాళ్లకు తోచింది చెబుతుంటారు. అయితే పాలు పొంగించే సంప్రదాయం పురాణకాలం నుంచి ఉందని..ఆనందాలు వెల్లివిరిసి అంతా శుభాలే జరుగుతాయనే నమ్మకం. సాధారణంగా మనం వంటచేసే సమయంలో పాలు పొంగుతుంటాయి.

పాలుపొంగిపోయానని బాధపడతాం. కానీ పాలు పొంగడం అంటే అగ్నిదేవుణ్ని ఆహ్వానిస్తున్నాం అని అర్ధం అంట. ఇక  సకల సంపదలకు అభినేత్రి అయిన లక్ష్మీదేవి సముద్రగర్భంనుంచి జన్మించింది. నారాయణి హృదయేశ్వరుడు పాల సంగ్రమమున పవళించిన శ్రీహరి. అందుకే పాలు పొంగిస్తే సుఖసంతోషాలతో మనఇల్లు కళకళాలాడుతుందని నమ్ముతారు. కొత్తింట్లో పాలు పొంగించకముందే గోమాతను ఆహ్వానిస్తారు. గోమాత ఆహ్వానంతో ఇంటికి ఉన్న దోషాలు తొలగిపోతాయంట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here