కరోనాపై పోరులో ప్రజలే ముందుండి నడిపిస్తున్నారు.. మన్ కీ బాత్‌లో మోదీ కితాబు

దేశం యావత్తు ఒకేతాటిపైకి వచ్చి కరోనా వైరస్‌తో పోరాటం చేస్తోంది, ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా మాదిరిగా పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. దేశమంతా చేయి చేయి కలిపి ఒకే లక్షంతో ముందుకు నడుస్తోందన్నారు. కరోనాపై పోరుకు ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని మోదీ కితాబిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశంలోని ప్రతి ఒక్కళ్లూ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారని అన్నారు. కరోనాపై సమరంలో ఉద్యోగులు, ఫించన్‌దారులు తమ వేతనాలో కొంత త్యాగం చేశారన్నారు.

ప్రపంచ దేశాలకూ భారతీయులు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, ఎంతో మంది దాతలు పేదలకు అండగా ఉంటున్నారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు మద్దతుగా నిలిచారని అన్నారు. విపత్తు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని మోదీ అన్నారు. కరోనా సృష్టించిన విలయాన్ని అధిగమించేందుకు అన్ని వర్గాలూ కొత్త మార్గాల గురించి అన్వేషిస్తున్నాయన్నారు. నుంచి వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.

ప్రజలకు ఏం చేయాలనే దానిపై ప్రతి ఒక్కళ్లూ ఆలోచిస్తున్నారని, అలా ఆలోచించే వారికి తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.

లాక్‌డౌన్ వేళ రైల్వే సేవలు అభినందనీయమని అన్నారు. నిత్యవసరాలను పెద్ద ఎత్తున రవాణా చేసి తమ వంతు సహాకారం అందజేస్తున్నాయన్నారు. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలపై ప్రశంసలు కురిపించారు. అవసరమైన వారికి ఆపన్నహస్తం అందజేయడం భారతీయ సంస్కృతిలో భాగమని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here