కూంబ్లే..కోహ్లీల మ‌ధ్య చిచ్చుపెట్టిన రూపాయ్

ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే ..చుట్ట‌కాల్చుకోవ‌డానికి నిప్పుదొర‌క‌లేద‌ని వేరొక‌డు ఏడ్చాట. అలా ఉంది ప్ర‌స్తుతం ఇండియ‌న్ టీం క్రికెట్ ప‌రిస్థితి. అభిమానులు ఐసీసీ ఛాంపియ‌న్ ట్రోఫీ గెల‌వాల‌ని కోరుకుంటుంటే …వీళ్లు మాత్రం త‌మ‌కు అడ్డుగా ఉన్న అనిల్ కూంబ్లేను తొల‌గించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మొద‌టి నుంచి కుంబ్లే రాక‌ను వ్య‌తిరేకించిన ఓ ప‌దిమంది ఆట‌గాళ్లు బీసీసీఐ పెద్ద‌ల‌కు మొర‌పెట్టుకున్నార‌ట‌.

కుంబ్లేకు మానవ‌త్వంలేద‌ని, ఆట‌గాళ్ల‌కు దెబ్బ‌లు త‌గిలినా ప‌ట్టించుకోర‌ని విమ‌ర్శిస్తున్నారు. అందుకే తొల‌త అనిల్ కూంబ్లేను వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు కొన‌సాగిద్దామ‌నుకున్న బోర్డు ఆలోచ‌న‌ల్ని మార్చేలా చేశారు. వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్ దాకా వ‌ద్దు ఇప్పుడే అనిల్ కుంబ్లేని సాగ‌నంపండి అని బీసీసీఐకు లేఖ రాశార‌ట‌. ఈ విష‌యం తెలిసిన మ‌రికొంద‌రు నవ్విపోదురు గాక నాకేమిటి అన్న‌ట్లుగా వ్య‌వ‌హరిస్తున్నార‌ని ప్ర‌స్తుత భార‌త క్రికెటర్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.
అంతేకాదు మాన‌వత్వం మ‌ట్టిమ‌శానం లేదు. అనిల్ త‌మ జీతాల్ని త‌గ్గించేలా బోర్డుతో సంప్ర‌దింపులు జ‌రిపారని …జీతం త‌గ్గించ‌డం అంటే ఓ రూపాయి వంతు త‌గ్గించి రంజీ క్రికెటర్లును ప్రోత్స‌హించేలా చేయాల‌ని బీసీసీఐని కోరాడ‌ట‌. అంతే ఆరూపాయే అనిల్ కుంబ్లేకు, విఠాట్ కోహ్లీకి మ‌ధ్య చిచ్చుపెట్టిన‌ట్లు భావిస్తున్నారు. అలా జీతాల్ని త‌గ్గించుకోవ‌డం  ఇష్టంలేని క్రికెటర్లు ఇలా అనిల్ ను సాగ‌నంపుతున్నార‌ని అంటున్నారు. అందుకే కూంబ్లే రాక‌ను విరాఠ్ వ్య‌తిరేకిస్తున్న‌ట్లు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here