కిషన్‌గంగా, రాట్లే ప్రాజెక్ట్‌లను ఆపండి.. పార్లమెంట్‌లో పాక్ తీర్మానం

జమ్మూ కశ్మీర్‌లో చేపట్టిన , రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్టులను భారత్ తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీలు సంయుక్తంగా తీర్మానించాయి. ఈ మేరకు పాక్ పత్రిక డాన్ ఓ కథనాన్ని ప్రచురించింది. సింధూ నది ఉపనదులు జీలం, చీనాబ్‌లపై భారత్ ఈ ప్రాజెక్టులను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. సింధూ జలాల ఒప్పందం విషయంలో ఇరు దేశాల మధ్య నెలకున్న వివాదాన్ని పరిష్కారించడానికి విదేశీ వ్యవహారాలు, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కమిటీల తీర్మానం ఆమోదించిన పాక్ జాతీయ అసెంబ్లీ.. ఈ విషయంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిటర్ ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంకును కోరింది.

ప్రకారం.. వివాదం పరిష్కారం బాధ్యత ప్రపంచ బ్యాంకుదేనని, దీనిపై ఆలస్యం చేయకుండా చర్యలు చేపట్టాలని పేర్కొంది. కోర్ట్ ఆఫ్ ఆర్బిటర్‌ను ప్రపంచ బ్యాంకు ఏర్పాటుచేసే వరకూ తక్షణమే విద్యుత్ ప్రాజెక్టులను భారత్ నిలిపివేయాలని ప్రవేశపెట్టిన సంయుక్త తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కమిటీలోని అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమయ్యింది.

పశ్చిమ భాగంలోని నదులపై ఆనకట్టల నిర్మాణానికి భారత్ సిద్ధపడటం వివాదానికి కారణమయ్యింది. భారత్ చేపట్టిన నిర్మాణం ముందుకు సాగకుండా అడ్డుకోవడానికి పాకిస్థాన్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇండస్ వాటర్ ట్రీట్‌లో కీలక పాత్ర పోషించిన ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. సింధు జలాల ఒప్పందానికి భారత్ తూట్లుపొడుస్తోందని పార్లమెంటరీ కమిటీలు ఆరోపించాయి. కమిటీలకు ఛైర్మన్‌లుగా వ్యవహరించిన అవాసీ అహ్మద్ ఖాన్ లెఘారీ, మొహమూద్ అర్షద్ ఖాన్ లేఘారీలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.

ఒకవేళ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తే తమ వద్ద అనేక దారులు ఉన్నాయని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి అజీజ్ చౌధురీ వ్యాఖ్యానించారు. ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తే తాము చూస్తూ కూర్చోమని, ఇప్పటికే ప్రపంచ బ్యాంకును సంప్రదించామని తెలిపాడు. ఆర్బిటర్ కోర్టును ఏర్పాటుచేసి, ఛైర్మన్‌ను నియమించాలని కోరినట్టు పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా వివాదం పరిష్కరించాలని భావిస్తున్నామని అన్నారు.

పశ్చిమ భాగాన ఉన్న నదులపై 45 నుంచి 60 వరకు ప్రాజెక్టుల నిర్మాణాలను భారత్ చేపట్టిందని అజీజ్ ఆరోపించాడు. కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్ట్ నిర్మాణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేశామని వాటర్, విద్యుత్ కార్యదర్శి యూనస్ దాఘా వ్యాఖ్యానించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here