ఇంట్లో పగిలిన ఫోటోలు ఉంటే ఏం చేయాలి

గుళ్లలో, తిరునాళ్లలో ఇంటికి తెచ్చిన దేవుడి ఫోటోలకు పూజలు చేస్తాం. కానీ కొన్ని రోజులకు అనుకోకుండా పగిలిపోతుంటాయి. అలా పగిలిన ఫోటోల్ని ఏం చేస్తుంటారు. దేవుడిగుడిలో పెట్టివస్తుంటారు. అలా చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. పగిలిన ఫోటోల అద్దాలను వేరు చేసి ఓ గుడ్డలో చుట్టు పాతిపెట్టాలి.  ఇక మిగిలిన ఫోటోలను ఎర్రటి గుడ్డలో చుట్టి వాటిలో పసుపు, కుంకుమ, బియ్యం కలిపి సముద్రం మధ్యలో కలపాలి. లేదంటే మనఇంటి పెరటులో గుంటతిసి అందులో పెట్టి నమస్కారం చేయాలి.

అంతేకాకుండా వినాయకనిమజ్జనం చేయని విగ్రహాల్ని అలాగే ఉంచకుండా బకెట్ నీళ్లలో అలాగే వారం రోజుల పాటు ఉంచాలి. అలా నానిన నీటిని పెరట్లో ఉన్న మొక్కలకి ఉపయోగించాలి. అలా చేస్తే ఎటువుంటి పాపాలు తగలకుండా ఉంటాయని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here