11 వేల‌మంది ఉద్యోగుల్ని తొల‌గించిన ఇన్ఫోసిస్

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఎఫెక్ట్ తో ఐటీ రంగం కుదేల‌వుతుంది. స్థానికుల‌కే ఉద్యోగాలంటూ ట్రంప్ మాట‌ల‌తో భార‌తీయులు అమెరికాలో స్థిర‌ప‌డేందుకు ఆంక్ష‌లు విధించారు. వీసా  పొడిగింపు, కొత్త‌గా అమెరికాకు వ‌చ్చే ఉద్యోగుల నియామ‌కాల్ని నిలిపివేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని ఐటీ ఉద్యోగులు డాల‌ర్ డ్రీమ్ ను వ‌దిలేసి తక్కువ జీతానికే ఇండియాలోనే సెటిల్ అవుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అమెరికాలో ఉన్న ఐటీ సంస్థ‌ల యాజ‌మాన్యాలు భార‌తీయ ఐటీ ఉద్యోగుల్ని నిర్ధాక్ష‌ణ్యంగా తొల‌గించింది. అదేబాట‌లో ఇన్ఫోసిస్ 11వేల మంది ఉద్యోగుల్ని తొలిగించి ఆటోమేష‌న్ వైపు మొగ్గు చూపింది. దీంతో 11వేల మంది ఉద్యోగ‌స్థుల్ని ఇన్ఫోసిస్ తొల‌గించినట్లు  శనివారం బెంగళూరులో జరిగిన 36వ వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించింది. అయితే మీడియాలో వస్తున్న రిపోర్టులను ఇన్ఫీ కొట్టిపారేసింది. బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు మధ్య మనస్పర్థలు లేవంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here