పార్లమెంట్ లో ట్రైలర్ లాంచ్ .. వింతల్లో వింత :

సినిమా ఫంక్షన్ అంటే సాధారణంగా ఆడియో కి మాత్రమె వేడుక చేసేవారు. కానీ ఇప్పుడు సినిమాకి సంబందించి ప్రతీ అంశాన్నీ వేడుక గా చెయ్యడం పరిపాటి అయిపొయింది. ట్రైలర్ కీ చివరికి ఫస్ట్ లుక్ లకి కూడా ఫంక్షన్ లు చేసే ప్రొడ్యూసర్ లు వచ్చేసారు. అంతా ప్రమోషన్ లో భాగమే అయినా ఆసక్తిని మాత్రం రేకెత్తిస్తున్నాయి కొత్త తరహా ప్రమోషన్ లు. బాలీవుడ్ డైరెక్టర్ తిగ్మాంషు ధులియా తెర‌కెక్కిస్తున్న రాగ్ దేశ్ చిత్ర ట్రైల‌ర్ రిలీజ్‌కు దేశ పార్ల‌మెంట్ వేదిక‌గా నిల‌వ‌టం విశేషం. కునాల్ క‌పూర్‌.. అమిత్ సాధ్‌.. మోహిత్ మార్వా న‌టించిన ఈ సినిమా మొత్తం దేశ స్వాతంత్ర పోరు లో కష్టపడిన ముగ్గురు ఐ ఏ ఎస్ అధికారుల చుట్టూ తిరుగుతుంది. పార్లమెంట్ లాంటి అత్యున్నత వేదిక ని ఒక సినిమా ట్రైలర్ విడుదల కోసం వాడడం ఇదే మొదటి సారి . వాళ్ళ సినిమాకి దక్కిన అతిపెద్ద గౌరవం గా చెబుతున్నారు ఆ చిత్ర బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here