ఆ డబ్బా కొట్టుకోవటం ఆపండి సార్..పబ్లిక్ నవుతున్నారు.?

ఒక‌రి గొప్ప‌లు మ‌రొక‌రు చెబితే విన‌డానికి బాగుంటుంది. అదే ఎవ‌రి గురించి వారే చెప్పుకుంటే అదేదో సోదిలా అనిపిస్తుంటుంది. ఇది ఏపీలో కొంద‌రికి బాగానే సెట్ అవుతుంది. తాజాగా ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు వైఖ‌రి కూడా ఇలానే అనిపిస్తోంది.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మొదలు కొని నేటి వ‌ర‌కు అభివృద్ది అంటే ముందుగా త‌న‌పేరే వినిపిస్తుంద‌ని చెప్తుంటారు చంద్ర‌బాబు. అయితే చేసే ప‌ని చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది మ‌న‌కు తెలిసిందే. ఇక చంద్ర‌బాబు చెబుతున్న‌ట్లు అభివృద్ధి జ‌రిగింటే అది చెప్పాల్సిన అవ‌స‌రం లేకున్నా యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లంతా ఇట్టే గ్ర‌హిస్తారు.

ఇప్పుడు అస‌లు విష‌యానికొస్తే విజ‌య‌వాడ‌లోని కోవిడ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ  ఓ మ‌హిళ చ‌నిపోయింది. ఈ విష‌యాన్ని హాస్పిట‌ల్ వ‌ర్గాలు కూడా దృవీక‌రించాయి. ఇక్క‌డి వర‌కు బాగానే ఉంది. అయితే చంద్ర‌బాబు నాయుడు ఇదే విష‌యంపై ఓ వీడియోను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఓ 34 సెకండ్ల వీడియో పోస్టు చేసి కోవిడ్ ఆసుప‌త్రిలో తీరు ఈ విధంగా ఉంద‌ని చెప్పారు.

ఇక ఇప్పుడే చంద్ర‌బాబు ప‌నిత‌నం బ‌య‌ట పెడుతున్నారు ప‌బ్లిక్‌. రాష్ట్రంలో సీనియ‌ర్ నాయ‌కుడుగా చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఏ మేర‌కు హాస్పిట‌ల్స్‌ను అభివృద్ధి చేశార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అపార అనుభ‌వం ఉంద‌నే బాబు.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ది బెస్ట్ హాస్పిట‌ల్స్‌, డాక్ట‌ర్స్‌, స్టాఫ్ ను అప్ప‌ట్లోనే రెడీ చేసి ప్ర‌జ‌ల‌కు అందిచొచ్చుక‌దా అని మాట్లాడుకుంటున్నారు.

ఇంకాస్త లోతుగా వెళితే 2015 మే నెల‌లో ఇదే విజ‌య‌వాడ‌లోని ప్ర‌ధాన గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌లో వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్న ఇద్ద‌రు వ్య‌క్తులు శ్వాస అంద‌క మృతి చెందారు. హాస్పిట‌ల్‌లో దాదాపు 4 గంట‌ల పాటు విద్యుత్ స‌ర‌ఫరా నిలిచిపోయి పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ప‌డిన విష‌యం ప్ర‌జ‌లెవ్వ‌రూ మ‌ర్చిపోలేదు. అంతే కాకుండా అదే సంవ‌త్స‌రం ఆగ‌ష్టులో గుంటూరులోని హాస్పిట‌ల్‌లో ప‌ది రోజుల ప‌సికందును ఎలుక‌లు దాడి చేశాయి. ఈ దాడుల్లో ప‌సికందు చ‌నిపోయాడు.

హాస్పిట‌ల్‌లో అనారోగ్యంతో మృతి చెందిన విష‌యంపై చంద్ర‌బాబు రియాక్ష‌న్ చూస్తున్న వారికి అప్ప‌ట్లో ఆయ‌న హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు గుర్తుకొస్తున్నాయి. ఆరోజు ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత బాద్యుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో ప‌క్క‌న పెడితే పోయిన ప్రాణాలు మాత్రం తిరిగిరావు. అంటే తన అనుభ‌వం గొప్ప‌ద‌ని గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబుకు త‌న ప‌రిపాల‌న‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లు ఎలా ప‌నిచేశాడో గుర్తు చేస్తున్నాయి.

విజ‌య‌వాడ కోవిడ్ ఆసుప‌త్రిలో మ‌హిళ మృతి ఘ‌ట‌న‌లో బాద్యుల‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుందో లేదో అటుంచితే. కోవిడ్ ఆసుప‌త్రిలో ప్ర‌తి పేషెంట్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద ఉంటుంది. పేషెంట్ కోలుకోగానే డిశ్చార్జ్ చేసి పంపుతారు. అలాంటిది అనారోగ్యంతో ఉంటే మ‌రింత కేర్ తీసుకుంటార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here