వివాదాస్ప‌దంగా మారిన చంద్ర‌బాబు వీడియో…

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు నాయుడు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. క‌రోనా పేషెంట్ల ప‌రిస్థితి ఆసుప‌త్రిలో ఈ విధంగా ఉందా అన్నట్లు ఆయ‌న వీడియో ట్విట్ట‌ర్‌లో ఉంచారు.

విజ‌య‌వాడ‌లోని స్టేట్ కోవిడ్ హాస్పిట‌ల్‌కి సంబంధించిన ఓ వీడియోను చంద్ర‌బాబు నాయుడు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పెట్టారు. ఈ వీడియోలో ఐసోలేష‌న్ వార్డులో ఉన్న ఓ మ‌హిళ ఆనారోగ్య కార‌ణాల వ‌ల్ల వాంతులు చేసుకుంది. వెంట‌నే ఆమె మంచంపై నుంచి కింద ప‌డి పోయింది. ఆ త‌ర్వాత ఆమె మృతిచెందారు.

అయితే ఒక పేషెంట్ కింద ప‌డినా అక్క‌డ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. మూడు గంట‌ల పాటు సిబ్బంది ఎవ్వ‌రూ రాలేద‌ని బాబు పోస్టు చేసిన వీడియో ద్వారా తెలియ‌జేశారు. ఈ ఘ‌ట‌న‌పై ఆసుప‌త్రి వ‌ర్గాలు స్పందించాయి. హాస్పిట‌ల్‌లో మ‌హిళ చ‌నిపోవ‌డం వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ సిబ్బంది ఎవ్వ‌రూ లేర‌నడం స‌రైంది కాద‌న్నారు. ప్ర‌తి వార్డులో సిబ్బంది ఉంటార‌న్నారు. ఆమె చ‌నిపోయిన విష‌యం తెలిసిన వెంట‌నే సిబ్బంది వెళ్లిపోయార‌ని.. అంత‌కుముందే వీడియో తీసి ఉంటార‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here