అదరహో బనానా టీ..తయారుచేసుకోండిలా..

ఈ ప్రపంచంలో అరటి పండ్లు లేని దేశం లేదు. ముంబై లాంటి చోట్ల భోజనం బదులు… అరటి పండ్లు తింటూ బతికేస్తారు చాలా మంది. అరటి పండ్లలో పోషకాలు చాలా ఎక్కువ. వెంటనే ఎనర్జీ కావాలంటే ఇవే సరైనవి. పైగా వీటిని తినడం కూడా చాలా ఈజీ. అందుకే చాలా రెసిపీల్లో ఇప్పుడు అరటి పండ్లను వాడుతున్నారు. మరి టీలో మాత్రం ఎందుకు వాడకూడదు అని అందులోనూ ట్రై చేశారు. టీ అదిరిపోయింది. అలా బనానా టీ పుట్టుకొచ్చింది. లక్కేంటంటే… బనానా టీ… చాలా రిలాక్స్ ఫీల్ కలిగిస్తోంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. దీన్ని ఎలా తయారుచేస్తారో, ఎలా టేస్ట్ ఉంటుందో అన్నీ ఇప్పుడు చకచకా తెలుసుకుందాం. బనానా టీని వేడి నీటిలో అరటి పండును ఉడికించడం ద్వారా తయారుచేస్తారు. బనానా బాగా ఉడికాక (10 నిమిషాలు ఉడికాక)… నీటిలో బుడగలు వస్తున్నప్పుడు… దాన్ని తొలగించి… ఆ నీటిని తాగుతారు. ఇందులో షుగర్ కలపాల్సిన పనిలేదు. అరటిలోని స్వీట్ కాస్తంత నీటిలో కలుస్తుంది కాబట్టి… నేచురల్ స్వీట్ లభిస్తుంది.

అరటి పండును తొక్కతోగానీ, తొక్క తీసి గానీ మీకు నచ్చినట్లు ఉడికించవచ్చు. తొక్కతో ఉడికిస్తే… దాన్ని బనానా తొక్క టీ అని పిలుస్తున్నారు. తొక్కతో ఎందుకు… అనవసరంగా అనుకోకండి. తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తొక్కతో ఉడికించిన బనానా టీ తాగితే… ఎక్కువ ఫైబర్ మీకు దక్కుతుంది. మీకు తెలుసు… ఫైబర్ వల్ల చాలా లాభాలున్నాయి. మల బద్ధకం సమస్య తీరుతుంది. పొట్టలో గడబిడ పోతుంది. అలాగే… తిన్న ఆహారం వెంటనే బ్లడ్‌లో కలిసిపోకుండా ఫైబర్ చేస్తుంది. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవారికి కొంత బెనిఫిట్ ఉంటుంది.

చాలా మంది బనానా టీలో దాల్చిన చెక్క లేదా… తేనె కూడా ఫ్లేవర్ కోసం కలుపుకుంటున్నారు. రాత్రి వేళ నిద్రపోయే ముందు ఈ బనానా టీ తాగితే… అదిరిపోతుందని చాలా మంది చెబుతున్నారు. నిద్రైతే… వద్దన్నా వచ్చేస్తుంది. ఈ బనానా టీలో విటమిన్ B6 (వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది), పొటాషియం (గుండెకు మేలు), మెగ్నీషియం (బ్రెయిన్‌కి మేలు), మాంగనీస్, కాపర్ (1) ఉంటాయి. నీటిని ఉడికించాక… అరటి పండును తొలగిస్తారు కాబట్టి… ఈ టీ తాగడం వల్ల ఎక్కువ కేలరీలు రావు. (మీకు తెలుసుగా బనానాలో కేలరీలు ఎక్కువ). బనానా టీలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి గుండెను కాపాడతాయి. అడ్డమైన రోగాలూ రాకుండా చేస్తాయి.

 

బనానా టీ తయారీ విధానం (తొక్క లేకుండా) :

గిన్నెలో 500 నుంచి 700 ఎంఎల్ నీటిని పోసి ఉడికించాలి.
నీరు ఉడుకుతున్నప్పుడు తొక్క తీసిన అరటిపండును వెయ్యాలి.
ఇప్పుడు సిమ్‌లో 5-10 నిమిషాలు ఉడికించాలి.- ఇప్పుడు దాల్చిన చెక్క పొడి, తేనె అందులో వెయ్యొచ్చు. (మీ ఇష్టం)
బనానాను తొలగించి… ఆ నీటిని రెండు, మూడు కప్పుల్లో పోసి… ఇద్దరు ముగ్గురు తాగొచ్చు.

 

బనానా టీ తయారీ విధానం (తొక్కతో) :
గిన్నెలో 500 నుంచి 750 ఎంఎల్ నీటిని పోసి ఉడికించాలి.
బనానాను బాగా కడిగి (మొదలు, చివర కట్ చేసి)… నెమ్మదిగా ఉడుకుతున్న నీటిలో వదలాలి.
ఇప్పుడు సిమ్‌లో 15-20 నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు దాల్చిన చెక్క పొడి, తేనె అందులో వెయ్యొచ్చు. (మీ ఇష్టం)
తొక్కతో ఉన్న బనానాను తొలగించి… ఆ నీటిని రెండు, మూడు కప్పుల్లో పోసి… ఇద్దరు ముగ్గురు తాగొచ్చు.

ఈ టీని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి… ఒకట్రెండు రోజుల్లో తాగొచ్చు. ఉడికిన నీటిలోంచీ తీసిన బనానాను పారేయకుండా… ఇతర రెసిపీల్లో, సలాడ్ల, బ్రెడ్‌ స్లైస్‌గా వాడుకోవచ్చు. లేదా మీరే తినేయవచ్చు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here