సీఎం కేసీఆర్‌కి హీరో నితిన్ పెళ్లి ఆహ్వానం

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, షాలినీల వివాహం ఈ నెల 26వ తేదీన రాత్రి 8 గంటలకు ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన పెళ్లికి రావాల్సిందిగా నితిన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా నితిన్‌కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలస్‌లో సన్నిహితుల సమక్షంలో నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లి ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలైపోయాయి.

ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూనే తన వివాహం జరపాలని చూస్తున్నాడు నితిన్. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇప్పటికే భీష్మ సినిమాతో హిట్ కొట్టిన నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరీతో ‘రంగ్ దే’.. చంద్రశేఖర్ యేలేటి ‘చెక్’.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అంధాధున్’ రీమేక్‌.. కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమాలు చేస్తున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here